అలాంటి వారి కోసం అన్వేషిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
హైదరాబాదులో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని లోకేశ్ వివరించారు. మానవ వనరులు, మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రణాళిక రూపొందించాల్సి ఉందని... కూటమి ప్రభుత్వంతో కలిసి నడవాలని ఏపీ ఈడీబీ (ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్)ని కోరుతున్నామని తెలిపారు.