నేడు ఏపీ ఈ- క్యాబినెట్ భేటీ
- పేపర్ లెస్ మంత్రి వర్గ సమావేశం నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు
- వైసీపీ హయాంలో ఈ – క్యాబినెట్ సమావేశాలకు స్వస్తి
- సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ – కేబినెట్ భేటీలు పునరుద్దరణ
సమావేశంలో అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఈ-ట్యాబ్లో మంత్రులకు అందజేయనున్నారు. ఇప్పటికే ట్యాబ్ల వాడకంపై సచివాలయ అధికారులు మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. 2014 -19 వరకు టీడీపీ హయాంలో ఈ - కేబినెట్ సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ - క్యాబినెట్ సమావేశాలకు స్వస్తి పలికారు. గత మంత్రివర్గ సమావేశంలోనే సీఎం చంద్రబాబు తదుపరి మంత్రివర్గ సమావేశాలు పేపర్ లెస్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ – క్యాబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.