సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు: మంత్రి మండిపల్లి
- కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సదస్సులకు హాజరు
- రికార్డుల ట్యాంపరింగ్ పై ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందన్న మంత్రి
- ఎన్టీఆర్ భవన్ లో నేడు ప్రజల నుంచి వినతుల స్వీకరణ
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇవాళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని అన్నారు.