Alla Ramakrishna Reddy: ఓటుకు నోటు కేసు... ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

SC dismisses Alla Ramakrishna Reddy petition
షార్ట్స్‌లో చూడండి
ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణను కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని... కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది.
Go Back to Shorts
Alla Ramakrishna Reddy
Revanth Reddy
Chandrababu
Andhra Pradesh
Telangana
Supreme Court

More Telugu News