సాయంత్రం 4 గంటలకు రండి.. జోగి రమేశ్‌కు మళ్లీ నోటీసులు
- చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్‌పై అభియోగాలు
- నిన్న విచారణకు గైర్హాజరు
- గతంలోనూ కుమారుడి అరెస్ట్ చూపి విచారణకు డుమ్మా
శుక్రవారం మంగళగిరి పోలీసుల ఎదుట జోగి రమేశ్ హాజరయ్యారు. గంటపాటు విచారించిన అనంతరం ఆయనను పంపించి వేశారు. నిన్న మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. జోగి రమేశ్ విచారణకు రాలేకపోతున్నట్టు ఆయన తరపు లాయర్లు పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాజగా మరోమారు పోలీసులు నోటీసులు జారీచేశారు.