Sangeetha: అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు: సంగీత

I dont like to act in Tamil movies says Sangeetha
షార్ట్స్‌లో చూడండి
తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించిన సంగీత చాలా కాలం పాటు పాప్యులర్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఆమె నటించింది. గాయకుడు క్రిష్ ను సంగీత ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తూనే ఉంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తమిళ సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించింది. తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే తనకు ఇష్టమని చెప్పింది. తమిళంలో నటించడం తనకు ఇష్టం లేదని చెపితే తమిళ అభిమానులకు ఆగ్రహం కలగవచ్చని... కానీ, తాను నిజమే చెపుతున్నానని వ్యాఖ్యానించింది. కోలీవుడ్ కంటే తనకు టాలీవుడ్ లోనే ఎక్కువ గౌరవం ఉందని చెప్పింది. 

తమిళంలో అవకాశాల కోసం ఫోన్ చేస్తే కొందరు మర్యాద లేకుండా మాట్లాడతారని... తనకు వారే జీవితాన్ని ఇస్తున్నట్టు ప్రవర్తిస్తారని సంగీత విమర్శించింది. తమిళ ఇండస్ట్రీలో తనకు మర్యాద లేదని, అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదని చెప్పింది. సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Sangeetha
Tollywood
Kollywood

More Telugu News