బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో రామ్ చరణ్... బాలీవుడ్ మెగాస్టార్ అని పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా
క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించే టెస్టు సిరీస్ విజేతలకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రదానం చేస్తారని తెలిసిందే. కాగా, నవంబరులో ఇరుజట్లు మరోసారి టెస్టు సిరీస్ లో తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఐఎఫ్ఎఫ్ఎం కోసం మెల్బోర్న్ విచ్చేసిన రామ్ చరణ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు.
రామ్ చరణ్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా రామ్ చరణ్ ను బాలీవుడ్ మెగాస్టార్ అని పేర్కొంది.
"మనలో ఒకరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కంటే ముందున్నారా? ఈ వేసవిలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య తీవ్ర పోరాటానికి ముందు బాలీవుడ్ మెగాస్టార్ రామ్ చరణ్ తో కలిసి మెల్బోర్న్ లో కోలాహలం సృష్టించడం సంతోషదాయకం" అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.