Advertisement

రజనీకాంత్ భారీ బడ్జెట్ మూవీ వేట్టైయాన్ విడుదల తేదీ వచ్చేసింది

Rajinikanth Vettaiyan Release Date Announced
  • అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • రజనీకాంత్-లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో నాలుగో మూవీ
  • కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్
సూపర్ స్టార్ రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘వేట్టైయాన్’ విడుదల తేదీ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టి.జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించాడు. రోబో 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి సినిమాల తర్వాత రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జనీకాంత్- రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. 

వేట్టైయాన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అంధాకానూన్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్ సినిమాల త‌ర్వాత రజనీ- అమితాబ్ క‌లిసి న‌టించిన నాలుగో సినిమా ఇది. మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికాసింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Advertisement
Vettaiyan
Rajinikanth
Amitabh Bachchan

More Telugu News