నా కూతురుకు ఈ దేశం గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చింది: వినేశ్ ఫొగాట్ తల్లి
- స్వాగతం పలికేందుకు గ్రామస్తులు, బంధువులు తరలి వచ్చారన్న తల్లి
- దేశమంతా నా కూతురును గౌరవిస్తున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్య
- కూతురు ఇంటికి వచ్చాక హల్వా తినిపిస్తానన్న తల్లి
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో ఫైనల్లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. అనర్హత వేటు నేపథ్యంలో తనకు కాంస్యం ఇవ్వాలంటూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించారు. సీఏఎస్‌లో ఆమెకు చుక్కెదురైంది.