ఇస్రో మరో ఘనత.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డీ3
- ఎస్ఎస్ఎల్వీ డీ3 ద్వారా ఈవోఎస్-08 శాటిలైట్ ను పంపిన ఇస్రో
- విపత్తుల సమయంలో కీలక సమాచారాన్ని పంపనున్న ఉపగ్రహం
- ఏడాది పాటు పని చేయనున్న శాటిలైట్
ఈవోఎస్ శాటిలైట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది.