At Home: రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం... హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఏపీ రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జిలు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. పలువురు టీడీపీ మంత్రులను గవర్నర్ కు పరిచయం చేశారు. 
At Home
Raj Bhavan
Governor
Chandrababu
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News