Health: నాలుక రంగు ఆధారంగా 98% కచ్చితత్వంతో వ్యాధి నిర్ధారణ.. రోగ నిర్ధారణలో విప్లవాత్మక ఆవిష్కరణ

New algorithm analyses tongue to predict diabetes stroke with 98 pc accuracy
షార్ట్స్‌లో చూడండి
మనిషి నాలుక రంగును విశ్లేషించి, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ (MTU) మరియు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (UniSA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ సరికొత్త ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా డయాబెటిస్, స్ట్రోక్, అనీమియా, ఆస్తమా, కాలేయం మరియు పిత్తాశయం సమస్యలు, కోవిడ్-19 వంటి అనేక వ్యాధులను గుర్తించవచ్చు. "నాలుక రంగు, ఆకారం, మందం వంటి లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి," అని MTU మరియు UniSAలో పరిశోధకులుగా ఉన్న అలీ అల్-నాజీ తెలిపారు.

ఈ పరిశోధనలో 5,260 చిత్రాలను ఉపయోగించి మిషన్ లెర్నింగ్ మోడల్ కు  శిక్షణ ఇచ్చారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం రియల్ టైమ్ డయాగ్నోసిస్‌లో ఉపయోగపడుతూ, వైద్య విధానాలను మరింత అభివృద్ధిపరచగలదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
Go Back to Shorts
Health
Artificial Intelligence
diabetes
tongue

More Telugu News