అన్నమయ్య జిల్లాలో బస్సు బోల్తా.. బస్సు కింద నలిగిన పసి ప్రాణం!
--
దీంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల వారు స్పందించి జేసీబీతో బస్సును పక్కకు తొలగించారు. అప్పటికే చిన్నారి మృత్యువాత పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. కాగా, స్కూలుకు బయలుదేరిన కూతురు బస్సు కింద పడి చనిపోయిందన్న వార్త తెలిసి పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.