ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం

Minor Accident To AP Minister Anitha Convoy
--
--
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లోని ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మంత్రి కారు దానిని ఢీ కొట్టింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను తప్పించే క్రమంలోనే ఎస్కార్ట్ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మంత్రి కారు, ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లారని వివరించారు.

Go Back to Shorts
Vangalapudi Anitha
AP Home Minister
Convoy
Accident

More Telugu News