షేక్ హసీనాను అరెస్ట్ చేసి అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్
- బంగ్లాదేశ్‌లో మరణాలకు హసీనానే కారణమన్న ఎస్సీబీఏ అధ్యక్షుడు మహబూబ్ ఖోకాన్
- ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నారని ఆరోపణలు
- భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం ముఖ్యమని వ్యాఖ్య
దేశంలో అనేక మరణాలకు షేక్ హసీనా కారణమని, చాలా మందిని బలిగొన్నారని అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించవద్దని అన్నారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ఎపీ) అనుకూల న్యాయవాదులు పాల్గొన్నారు. షేక్ హసీనాను అప్పగించాలన్న ఖోకాన్ బీఎన్పీ పార్టీకి జాయింట్ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేస్తున్నారు.