తెలుగు పానీ పూరీ వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం
కాగా, చిరంజీవి తన వ్యాపార వృద్ధి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద రుణం తీసుకున్నారు. బకాయిలను సకాలంలో చెల్లించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించినందుకుగాను ఆయకు ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు.
తనకు అందిన ఈ అరుదైన ఆహ్వానం పట్ల ఆనందంగా ఉందని మేఘావత్ చిరంజీవి తెలిపారు. తనకు ఆహ్వానం పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.