సీఎం ఛాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన... కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!
- సబితకు క్షమాపణ చెప్పాలని సీఎం ఛాంబర్ వద్ద నినాదాలు
- కేటీఆర్, హరీశ్ రావులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బీఆర్ఎస్ కార్యాలయం వైపు తరలింపు
కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి... బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకువెళ్లారు.
పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజు నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.