సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం వైసీపీ నేతలు
- ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరిక
- అందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్
- కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న నేతలు
ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ, కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. వైనాట్ 175 అన్నారు... కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు.... కుప్పంను సర్వనాశనం చేశారు అంటూ వారు ధ్వజమెత్తారు.
కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందని వివరించారు.
ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ, త్వరలోనే మరికొందరు కుప్పం వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు.