సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే

  • ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన న్యాయ విద్యార్థి
  • విద్యార్థి చికిత్సకు సాయం కోరిన పుతుంబాక భారతి
  • వెంటనే స్పందించి రూ.10 లక్షల సాయం అందించిన చంద్రబాబు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్సకు సాయం చేయాలని కోరగా, సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల సాయం అందించారు. ఈ నేపథ్యంలో, పుతుంబాక భారతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథం చూపించారంటూ కొనియాడారు.

Chandrababu
Putumbaka Bharati
Sai Phanindra
Road Accident
TDP
Andhra Pradesh

More Telugu News