బీఆర్ఎస్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి!

BRS petition in high court against Danam and Kadiyam
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్
  • స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్న న్యాయవాదులు
  • తదుపరి విచారణను 30కి వాయిదా వేసిన హైకోర్టు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా పడింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ తదితర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను వారు చదివి వినిపించారు. అనంతరం తదుపరి విచారణను వాయదా వేసింది.
Go Back to Shorts
Kadiam Srihari
Danam Nagender
BRS
Telangana
TS High Court

More Telugu News