Rains: పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజికి పోటెత్తుతున్న వరద

Water flooded to Prakasam Barrage in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండం ప్రభావంతో కర్ణాటకలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్యవసానంగా కృష్ణమ్మ వరద ఉద్ధృతి పెరిగి పరవళ్లు తొక్కుతోంది. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. 

నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల జలాశయానికి 83 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ వద్ద 81,160 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. 

విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద కూడా వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో 7,519 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో 5,840 క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు పెరుగుతుండడంతో ప్రకాశం బ్యారేజిలో 8 గేట్లు ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Go Back to Shorts
Rains
Krishna River
Flood
Prakasam Barrage
Vijayawada

More Telugu News