సౌదీలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి నారా లోకేశ్ హామీ
- నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన వీరేంద్ర కుమార్
- సౌదీ ఎడారిలో ఒంటెల మధ్య పడేశారని ఆవేదన
- స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్న లోకేశ్
నకిలో ఏజెంట్ చేతిలో తాను మోసపోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని వీరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశాడు. ఖతార్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి... తనను మోసం చేసి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో తాను బాధపడుతున్నానని, ఇక్కడ బతకలేకపోతున్నానని చెప్పాడు. వీరేంద్ర వీడియో చూసి నారా లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.