ఆదాయంలో బీఆర్ఎస్ టాప్, ఖర్చులో రెండో స్థానంలో వైసీపీ
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.737 కోట్లతో అగ్రస్థానంలో బీఆర్ఎస్
- రూ.181 కోట్ల ఖర్చుతో మొదటిస్థానంలో టీఎంసీ
- రూ.79 కోట్ల ఖర్చుతో రెండో స్థానంలో వైసీపీ
ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై ఏడీఆర్ నివేదికను సిద్ధం చేసింది. ఏడీఆర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 57 ప్రాంతీయ పార్టీలలో 39 పార్టీల ఆదాయ, వ్యయ నివేదికలను వెల్లడించింది. ఆదాయంలో బీఆర్ఎస్ తర్వాత టీఎంసీ రూ.333.45 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. డీఎంకే రూ.214.35 కోట్లతో మూడో స్థానంలో, ఉంది.