పోటెత్తుతున్న వరద.. నిండుకుండలా హుస్సేన్ సాగర్
- హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 513.21 అడుగులు
- మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన
మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.