జేఎన్టీయూ ఆహారంలో ఎలుక.. కేటీఆర్ ట్వీట్

KTR tweet on JNTU food
  • ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్న కేటీఆర్
  • జేఎన్టీయూలో పిల్లి, ఎలుక వీడియోలు షేర్ చేసిన క్రిశాంక్
  • జేఎన్టీయూ పిల్లులు, ఎలుకలకు నిలయంగా మారిందన్న కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసింది. వివిధ అంశాలపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జేఎన్టీయూలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారంలో పడిన ఎలుక, ఆహారాన్ని తింటున్న పిల్లికి సంబంధించి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ షేర్ చేశారు. ఆహారంలో పడిన ఎలుకను వెతుక్కుంటూ వచ్చిన పిల్లి అని క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ జేఎన్టీయూ పిల్లులు, ఎలుకలకు నిలయంగా మారిందని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
KTR
BRS
JNTU

More Telugu News