Shivam Bhaje: గంగా ఎంటర్టయిన్ మెంట్స్ 'శివం భజే' ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్

Shivam Bhaje movie set to release on August 1
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన గంగా ఎంటర్టయిన్ మెంట్స్ 'శివం భజే' చిత్రాన్ని ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఇవాళ తెలిపారు. 

అప్సర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, ఇనాయా సుల్తానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాగా, ట్రైలర్ మరియు పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ... శివం భజే చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. టైటిల్, టీజర్ తో అందరి దృష్టి ఆకర్షించిన తమ చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయని తెలిపారు. 

"హీరో అశ్విన్ బాబు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వరరెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. మా పాటలు, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం" అని వెల్లడించారు. ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతం అందించారు.
Go Back to Shorts
Shivam Bhaje
Release Date
Ganga Entertainments
Apsar

More Telugu News