Raj Tarun: పోలీసులకు ఆధారాలు అందించిన లావణ్య... నార్సింగి పీఎస్ లో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

Police files case against Raj Tarun
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ షార్ట్ ఫిలిం నటి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు తగిన ఆధారాలు అందించాలని పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు.

తాజాగా ఆమె తన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. లావణ్య పోలీసులకు 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను అందించారు. దాంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 493, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజ్ తరుణ్ తో పదేళ్ల క్రితమే పెళ్లయిందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య వెల్లడించారు. లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి ఉంటున్నామని, అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని చెప్పారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య తెలిపారు. 

"మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడు. మాల్వీ కోసం రాజ్ తరుణ్ ముంబయి కూడా వెళ్లడంతో నేను ప్రశ్నించాను. ఇప్పుడు మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాయిస్ రికార్డు చేశాడు" అని పేర్కొన్నారు లావణ్య.
Go Back to Shorts
Raj Tarun
Lavanya
Case
Police
Hyderabad
Tollywood

More Telugu News