దొంగ పక్షులు.. నోటికాడి శాండ్ విచ్ ను క్షణంలో కాజేశాయి.. వీడియో ఇదిగో!
- లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ శాండ్ విచ్ తినేందుకు యూట్యూబర్ ప్రయత్నం
- ఒక్కసారిగా దాడి చేసిన సీగల్స్ గుంపు
- భయంతో శాండ్ విచ్ పక్కన పడేసిన మహిళ
- ఆ ముక్కలు అందుకుని ఎగిరిపోయిన పక్షులు
మనుషుల చేతుల్లోని ఆహార పదార్థాలను ఇట్టే మాయం చేయడంలో సీగల్స్ పక్షులు ఆరితేరాయి. కన్నుమూసి తెరిచేలోపు చేతిలోని ఆహార పదార్థాన్ని నోట కరుచుకుని ఎగిరిపోతాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. అయితే, తాజాగా ఓ మహిళ నది ఒడ్డున కూర్చుని బ్యాగులో నుంచి శాండ్ విచ్ బయటకు తీసింది. దానిపైనున్న రేపర్ తీసి నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించేలోగా సీగల్స్ వాసన పసిగట్టాయి. అంతే, ఒక్కసారిగా మహిళపై దాడి చేసి శాండ్ విచ్ ను మాయం చేశాయి. దీనిపై సదరు యూట్యూబర్ స్పందిస్తూ.. సీగల్స్ దాడి చేయడంతో తొలుత భయపడి కేకలు వేశానని, శాండ్ విచ్ పక్కన పడేయడంతో అవి తన జోలికి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల ఉన్నవారు సాయానికి వచ్చేలోగా సీగల్స్ తమ పని పూర్తిచేసుకుని ఎగిరిపోయాయని చెప్పారు.