ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ .. 'తలవన్'

Thalavan Movie Update
  • మలయాళ మూవీగా 'తలవన్'
  • ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లోని సినిమా 
  • ప్రధాన పాత్రలో బిజూ మీనన్ - అసిఫ్ అలీ 
  • కథానాయికలుగా మియా జార్జ్ - అనుశ్రీ    

మలయాళంలో బిజూ మీనన్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాగే హీరోగా అసీఫ్ అలీకి కూడా మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'తలవన్'. అరుణ్ నారాయణ్ నిర్మించిన ఈ సినిమాకి జిస్ జోయ్ దర్శకత్వం వహించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమా ఇది. 

మే 24వ తేదీన థియేటర్ లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, చాలా వేగంగా అక్కడ 25 కోట్లను వసూలు చేసింది. దీపక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికలుగా మియా జార్జ్ - అనుశ్రీ నటించారు. అలాంటి ఈ సినిమాను సోనీ లివ్ వారు సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. 

 సీఐగా జయశంకర్ (బిజూ మీనన్) పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కి కొత్తగా ఎస్ ఐ కార్తీక్ వాసుదేవన్ ( అసీఫ్ అలీ) వస్తాడు. జయశంకర్ కి మాట మాత్రమైనా చెప్పకుండా ఆ స్టేషన్లో నేరస్థుడిగా ఉన్న ఒక వ్యక్తిని కార్తీక్ వాసుదేవన్ రిలీజ్ చేస్తాడు. ఆ విషయంలో జయశంకర్ మందలించడంతో కార్తీక్ పగ పెంచుకుంటాడు. అదే సమయంలో జయశంకర్ ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. అప్పుడు కారఃతీక్ ఏం చేస్తాడనేది కథ. 
Go Back to Shorts
Biju Menon
Asif Ali
Anusree
Thalavan

More Telugu News