ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ .. 'తలవన్'
- మలయాళ మూవీగా 'తలవన్'
- ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లోని సినిమా
- ప్రధాన పాత్రలో బిజూ మీనన్ - అసిఫ్ అలీ
- కథానాయికలుగా మియా జార్జ్ - అనుశ్రీ
మే 24వ తేదీన థియేటర్ లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, చాలా వేగంగా అక్కడ 25 కోట్లను వసూలు చేసింది. దీపక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికలుగా మియా జార్జ్ - అనుశ్రీ నటించారు. అలాంటి ఈ సినిమాను సోనీ లివ్ వారు సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
సీఐగా జయశంకర్ (బిజూ మీనన్) పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కి కొత్తగా ఎస్ ఐ కార్తీక్ వాసుదేవన్ ( అసీఫ్ అలీ) వస్తాడు. జయశంకర్ కి మాట మాత్రమైనా చెప్పకుండా ఆ స్టేషన్లో నేరస్థుడిగా ఉన్న ఒక వ్యక్తిని కార్తీక్ వాసుదేవన్ రిలీజ్ చేస్తాడు. ఆ విషయంలో జయశంకర్ మందలించడంతో కార్తీక్ పగ పెంచుకుంటాడు. అదే సమయంలో జయశంకర్ ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. అప్పుడు కారఃతీక్ ఏం చేస్తాడనేది కథ.