మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ... గార్డ్ ఆఫ్ ఆనర్ తో స్వాగతం
- రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
- 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న మోదీ
- ఐదేళ్ల తర్వాత తొలిసారి రష్యాలో మోదీ పర్యటన
ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భాగంగా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై లోతైన చర్చలు జరపనున్నారు.
భద్రత, ఇంధనం, పెట్టుబడులు, టూరిజం, విద్య తదితర రంగాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఐదేళ్ల అనంతరం ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తుండడం ఇదే ప్రథమం. 2019లో రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సుకు మోదీ హాజరయ్యారు.