జగన్ అనుకూలురుగా ముద్రపడిన అధికారులపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు
- రామాంజనేయులు, సునీల్, సంజయ్, జవహర్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు
- బాధ్యతలు విస్మరించి పని చేశారని మండిపాటు
- వీరి పరిస్థితి భావి అధికారులకు గుణపాఠం కావాలని వ్యాఖ్య
'బాధ్యతలు విస్మరించి, విధి నిర్వహణలో నేల విడిచి సాముచేసిన సీనియర్ అధికారులు రామాంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, జవహర్ రెడ్డి తదితరుల ప్రస్తుత పరిస్థితి జాతీయ స్థాయి భావి అధికారులకు గుణపాఠం కావాలి. వారి ట్రైనింగ్ లలో పాఠ్యంశాలుగా చేర్చాలి. సమాజానికి మార్గదర్శకులుగా తీర్చిదిద్దాలి' అని ఆయన ట్వీట్ చేశారు.