రేషన్ మాఫియాపై సీఐడీ విచారణ: ఏపీ మంత్రి నాదెండ్ల
- కాకినాడ అడ్డాగా గత ప్రభుత్వంలో కొనసాగిన దోపిడీ
- పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపణ
- వేల కోట్లు పోగేసుకున్నారని మండిపడ్డ మంత్రి
మంత్రి పర్యటన ఉందని తెలిసి 4 రోజులుగా అక్రమ బియ్యం తరలించారని చెప్పారు. అంతకుముందు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపి, గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ‘పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం రూ.36,300 కోట్లు అప్పు చేసింది. రైతులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. కౌలు రైతులకు మేలు చేస్తాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.