జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఇల్లు.. 25,000 చదరపు అడుగుల ఇంద్రభవనం!
- హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ విలాసవంతమైన భవంతి
- 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
- చిరంజీవి, ఉపాసనతో కలిసి కుటుంబంతో నివాసం
- జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి ప్రత్యేక సౌకర్యాలు
దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ విశాలమైన ఇంట్లో రామ్ చరణ్ తన భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖలతో కలిసి నివసిస్తున్నారు. బయటి నుంచి శ్వేతవర్ణంలో, పచ్చని చెట్ల నడుమ ప్రశాంతంగా కనిపించే ఈ భవనం, లోపల మాత్రం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. చెస్‌బోర్డ్‌ను పోలిన ఫ్లోరింగ్, మార్బుల్ ఫినిషింగ్, ఖరీదైన ఫర్నిచర్, భారీ షాండ్లియర్లు మరియు అరుదైన కళాఖండాలతో ఇంటీరియర్ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది.
ఈ నివాసంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సహజ సిద్ధమైన వెలుతురు ధారాళంగా వచ్చేలా పెద్ద కిటికీలు, ఫ్రెంచ్ డోర్లను ఏర్పాటు చేశారు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా ఉడెన్ ఫ్లోరింగ్‌తో కూడిన జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. సినీ కుటుంబం కావడంతో, సినిమాలు వీక్షించేందుకు ఒక ప్రైవేట్ హోమ్ థియేటర్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. వీటితో పాటు రీడింగ్ రూమ్, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పూజా గది కూడా ఈ ఇంటి ప్రత్యేకతలు.