ఏపీలోని పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు లేఖ

29-06-2024 Sat 11:11 | Andhra
Advertisement
  • పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానన్న బాబు 
  • ఏ ఆకాంక్షలతో మీరు ఓటేసి గెలిపించారో వాటిని నెరవేర్ఛడమే మా తక్షణ కర్తవ్యమని వెల్లడి 
  • మాటిచ్చినట్లే పెంచిన పింఛన్ మీ ఇంటివద్దనే అందిస్తామన్న  సీఎం 
Advertisement
‘ఏ ఆకాంక్షలతో మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ, ప్రథమ కర్తవ్యం..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పెంచిన పింఛన్ ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తాజాగా జులై 1న రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మూడు నెలలకు పెంచిన రూ.3000, జులై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తామని అన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు. 

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చెప్పారు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలనెలా అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చినట్లు వివరించారు.

'పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తాయని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నా'నని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
Advertisement
ChandrababuPensionersOpen LetterAP CmPensionsAndhra Pradesh

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more