రద్దయిన యూజీసీ-నెట్ ఎగ్జామ్కు కొత్త షెడ్యూల్ ప్రకటన
- ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడి
- ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహణ
- కీలక ప్రకటన చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
కాగా ఇప్పటివరకు పెన్ను, పేపర్ విధానంలో జరిగిన యూజీసీ-నెట్ ఎగ్జామ్ను ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. కాగా జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్డీ స్కాలర్ల ఎంపిక కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా రెండు విడతలుగా యూజీసీ-నెట్ ఎగ్జామ్ జరిగింది. అయితే అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడ్డాయి. విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పరీక్ష సమగ్రత దెబ్బతినడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష జరిగిన మరుసటి రోజే రద్దు చేసింది.