అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి... ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు స్పీకర్ నోటీసులు
- ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి
- ఘటనపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన హైదరాబాద్ ఎంపీ
- ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేసిన ఓం బిర్లా
ఈ క్రమంలో, గత రాత్రి ఆయన నివాసంపై ఆగంతుకులు దాడి చేశారు. ఈ ఘటనపై లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒవైసీ వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యంత భద్రత జోన్‌గా పరిగణించే ఈ ప్రాంతంలో దాడి జరగడంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.