Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.33 కోట్ల జాక్‌పాట్ వరించడంతో పట్టరాని సంతోషం.. అనంతరం గుండెపోటు

a man suffered a heart attack while celebrating Winning of Rs 33 Crore Jackpot At Singapore Casino
Advertisement
  • సంతోషంతో ఎగిరి గంతేస్తుండగా కార్డియాక్ అరెస్ట్
  • హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
  • సింగపూర్‌లో జరిగిన ఆసక్తికర ఘటన
Advertisement
జీవితాన్ని మలుపు తిప్పే సందర్భాన్ని సందడిగా వేడుక చేసుకుంటున్న ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. సెలబ్రేషన్స్ మధ్యలోనే అతడు కుప్పకూలాడు. సింగపూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ క్యాసినోకు రెగ్యులర్‌గా వెళ్లే ఓ వ్యక్తికి దశ మారిపోయే.. కలలో కూడా ఊహించని జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.33.76 కోట్ల విలువైన జాక్‌పాట్ అతడిని వరించింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అతడు ఎగిరి గంతేశాడు.

జూన్ 22న తను రెగ్యులర్‌గా వెళ్లే మెరీనా బే సాండ్స్ క్యాసినోలో ఆనందంతో ఎగిరి గంతేస్తున్న అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అప్పటివరకు సందడిగా ఉన్న క్యాసినో ఒక్కసారిగా సైలెంట్ అయింది. సదరు వ్యక్తి పక్కన ఉన్న మహిళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. క్యాసినో సిబ్బంది తక్షణమే సాయం అందించడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. దీంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.  

కాగా సోషల్ మీడియాలో సదరు వ్యక్తి చనిపోయాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని అతడి సన్నిహిత వ్యక్తులు కొట్టిపారేశారు. ఆయన బతికే ఉన్నారని, ఆసుపత్రిలో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. క్యాసినో ప్రతినిధి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. 
Advertisement
Advertisement
Singapore
Jackpot
heart attack
Singapore Casino
Marina Bay Sands Casino

More Telugu News