నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియా చాన్స్... మంత్రి నారా లోకేశ్ స్పందన
- జింబాబ్వేతో టీ20 సిరీస్ కు టీమిండియా ఎంపిక
- తొలిసారి టీమిండియాకు ఎంపికైన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి
- ఏపీ బిడ్డ అంటూ సంతోషం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్
కాగా, నితీశ్ కుమార్ కు టీమిండియా అవకాశం లభించడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
"మనవాడు నితీశ్ కుమార్ కు తొలిసారిగా టీమిండియా నుంచి పిలుపు రావడం పట్ల సంతోషిస్తున్నాను. దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా క్రికెట్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఏపీ బిడ్డ నితీశ్ కుమార్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అద్భుతంగా ఆడినందుకు తగిన కానుక లభించింది. జింబాబ్వేతో టీ20 సిరీస్ లో నితీశ్ కుమార్ రాణించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్" అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.