Pawan Kalyan: ఎల్లుండి నుంచి వారాహి మాత దీక్ష చేపట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan takes Varahi deeksha
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టనున్నారు. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను పాటించనున్నారు. వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవ రూప ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

2023 జూన్ లో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారుచేయించుకున్న పవన్ కల్యాణ్ దానికి 'వారాహి' అని పేరుపెట్టిన సంగతి తెలిసిందే. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మ వారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.
Go Back to Shorts
Pawan Kalyan
Varahi
Janasena
Andhra Pradesh

More Telugu News