ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మహిళ ‘చావు’తెలివి.. అస్సలు ఊహించని ట్విస్టులు
- చనిపోయినట్టు నటించి.. తనకు తానే భర్తగా అవతారం
- ఆస్ట్రేలియాలో బయటపడిన భారీ కుట్ర
- 5 లక్షల డాలర్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ మహిళ ఊహించని నాటకం
కుట్ర బయటపడిందిలా..
భర్త పేరిట తీసుకున్న బ్యాంక్ ఖాతాలో ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు జమ చేసింది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంపై సందేహించిన సదరు బ్యాంక్ అధికారులు ఖాతాను స్తంభింపజేశారు. దీంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నిందితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కథ అనూహ్య మలుపులు తిరిగింది. సాల్కిల్డ్ చనిపోయిందంటూ నకిలీ పత్రాలు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె ఆడుతున్న నాటకాన్ని పోలీసులు పసిగట్టారు. అసలు గుట్టును లాగారు. మోసానికి పాల్పడిందని నిర్ధారణ అయింది. డెత్ సర్టిఫికేట్, మరణంపై దర్యాప్తు రికార్డులతో పాటు అనేక నకిలీ సర్టిఫికేట్లను ఆమె సృష్టించిందని తేలింది. ఈ మేరకు కోర్టులోనూ రుజువైంది. దీంతో జులై నెలలో కోర్టు ఆమెకు జైలు శిక్షను ఖరారు చేయనుంది. కాగా నిందితురాలిని మార్చి నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బీమా సొమ్ము కోసం విస్తృతమైన కుట్ర పన్నిందని, మరణ ధ్రువీకరణ పత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు.
కాగా నిందితురాలు సైకిల్డ్ గతంలో మాజీ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారని, ఎఫ్45 అనే జిమ్‌ను నిర్వహించారని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియాలోనే వెలుగుచూసిన మరో కేసులో ఓ మహిళ తనకు రొమ్ము క్యాన్సర్ ఉందంటూ ‘గోఫండ్‌మీ’ ద్వారా 25 వేల డాలర్లు ఫండ్ సేకరించిందని తేలింది.