T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ గెలిచిన ఇంగ్లండ్

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. 

సూపర్-8 దశలో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. తన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో అమెరికా జట్టుపై గెలవగా.... ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లతో ఆతిథ్య వెస్టిండీస్ ను ఓడించింది. నేటి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

ఓపెనర్ ఫిల్ సాల్ట్, జానీ బెయిర్ స్టో ఊపుమీదుండడం ఇంగ్లండ్ కు లాభించే అంశం. దక్షిణాఫ్రికా టాపార్డర్లో డికాక్, కెప్టెన్ మార్ క్రమ్ ఫామ్ లో ఉండగా, క్లాసెన్, స్టబ్స్ కూడా తలో చేయి వేస్తున్నారు. ఇరుజట్లకు మంచి బౌలింగ్ వనరులు ఉన్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
T20 World Cup 2024
Super-8
England
South Africa

More Telugu News