రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై షర్మిల ఏమన్నారంటే..!
- ఏపీ రాజకీయాల్లో సంచలనంగా రుషికొండ అంశం
- ఇదే అంశంపై తాజాగా స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
- రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజాధనం ఖర్చు పెట్టి ఉంటే క్షమించరాని నేరమని వ్యాఖ్య
- ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపించారు.