రుషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి: గుడివాడ అమర్‌నాథ్

17-06-2024 Mon 13:02 | Andhra
Advertisement
  • దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమన్న అమర్ నాథ్ 
  • తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని వెల్లడి 
  • ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాకే భవనాలు నిర్మించామని వివరణ 
  • రాష్ట్రప్రతి, ప్రధాని, గవర్నర్ వంటి వారి ఆతిథ్యానికి వాటిని వాడుకోవచ్చని సూచన 
  • ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని సలహా  
Advertisement
రుషికొండ ‌భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ‌ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి, దానిని ఇంకా జగన్‌మోహన్‌రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని కానీ, అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత రుషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. 

ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపైనా మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారనే అలాంటి విషయాల జోలికి పోవడం లేదని తెలిపారు. 

నగరానికి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, లేదంటే ఇతర ముఖ్యులు వస్తే ప్రైవేటు హోటళ్లలోనో, మరెక్కడో ఉంచాల్సిన పరిస్థితి వస్తోందని, ఇప్పుడు రుషికొండ భవనాలను వారి ఆతిథ్యానికి వాడుకోవచ్చని వివరించారు. దీనిపై ఇంకా రాద్ధాంతం తగదని హితవు పలికారు. ప్రజలిచ్చిన అధికారాన్ని తమకంటే మంచి చేయడానికి ఉపయోగించాలని, ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించే చర్యలకు ఉపయోగించవద్దని అమర్‌నాథ్ హితవు పలికారు.
Advertisement
Rushikonda PalaceGudivada AmarnathYSRCPAndhra PradeshVisakhapatnam

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more