చంద్రబాబు ప్రమాణానికి వీల్ చెయిర్ లో వచ్చిన పులివర్తి నాని
- అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నానిపై దాడి
- వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో గాయపడ్డ నాని
- కాలికి పట్టీ వేసిన వైద్యులు
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలనకు వెళ్లారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి తిరిగి వస్తుండగా.. వైసీపీ శ్రేణులు నానిపై దాడికి దిగాయి. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ తెదేపా నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.