చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీ విశిష్ట అతిథిగా చిరంజీవికి ఆహ్వానం

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.

ఈ క్రమంలో చిరంజీవి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళతారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 


More Telugu News