సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ బహిరంగ లేఖ
- సోం డిస్టిలరీస్ సంస్థపై మంత్రి జూపల్లి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారన్న క్రిశాంక్
- సోం డిస్టిలరీస్ రుణాలు తీసుకొని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేస్తోందని ఆరోపణ
- కమీషన్ కోసం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇవ్వవద్దని విజ్ఞప్తి
సోం డిస్టిలరీస్ సంస్థ రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతిగాంచిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారని పేర్కొన్నారు. దయచేసి కమీషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానీకరమైన మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకు రావొద్దని కోరారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి సోం డిస్టిలరీస్‌కు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరారు.