నరేంద్ర మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
- వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీ
- మోదీని, భారత ప్రజలను అభినందించిన పుతిన్
"రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశ ప్రజలు రికార్డు స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో పాలుపంచుకోవడం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీయే విజయాన్ని అభినందించారు. భారత్-రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరుదేశాల నిబద్ధతను ఉద్ఘాటించాం" అని మోదీ తన ట్వీట్ లో వివరించారు.