ఓడిపోయినా జోష్ తగ్గలేదు.. ట్రోలర్లకు స్మృతి ఇరానీ జవాబు
- పదేళ్లు గ్రామీణుల సేవలోనే గడిచిపోయాయని వ్యాఖ్య
- గెలుపు ఓటములలో నా వెన్నంటి ఉన్న వారికి కృతజ్ఞతలు
- సంబరాలు చేసుకుంటున్న వారికి అభినందనలు
- జోష్ ఎలా ఉందన్న ప్రశ్నకు ఇప్పటికీ తగ్గేదేలేదన్న స్మృతి ఇరానీ
తన ఈ ప్రయాణంలో ఎన్నో గెలుపు ఓటములు ఎదురయ్యాయని, అన్ని సందర్భాల్లోనూ తనతో పాటే ఉన్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. వారికి ఎన్నటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. లోక్ సభ ఫలితాల తర్వాత సంబరాలు జరుపుకుంటున్న వారికి అభినందనలు చెప్పారు. చివరగా.. తన ఓటమిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘జోష్ ఎలా ఉంది మేడం’ అంటూ అడుగుతున్న వారికి స్మృతి ఇరానీ జవాబిచ్చారు. ఓడిపోయినా సరే జోష్ తగ్గలేదనే చెప్పారు. ఇప్పటికీ జోష్ చాలా హై లెవల్ లోనే ఉందని ట్రోలర్లను ఆమె కౌంటర్ ఇచ్చారు.