వైసీపీ నేత పేర్నినాని ఇంటిపై రాళ్ల దాడి.. వీడియో ఇదిగో!

Stone attack on YCP leader Perni Nani house
  • రాళ్లు కుర్చీలతో దాడి
  • రోడ్డుపై పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం
  • మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు
  • ఇలాంటి వాటిని ప్రోత్సహించే జగన్ ఓడిపోయారని గుర్తుచేస్తున్న నెటిజన్లు
  • కర్మ అనుభవించక తప్పదంటున్న మరికొందరు
వైసీపీ నేత పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కుర్చీలు విసురుతూ బీభత్సం సృష్టించారు. అక్కడే పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం చూపారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని నిలువరించలేకపోయారు. పైపెచ్చు దాడి భయంతో ఓ పోలీసు పారిపోవడం కనిపించింది.

ఈ దాడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది టీడీపీ, జనసేన కార్యకర్తల పనేనని ఆరోపిస్తుండగా, అప్పుడే ఇలాంటి ప్రతీకారాలేంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్లనే జగన్‌ ఓటమి పాలయ్యారని గుర్తుచేస్తున్నారు. మరికొందరు మాత్రం చేసిన కర్మ అనుభవించక తప్పదు (కర్మ హిట్‌బ్యాక్) అని కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Perni Nani
YSRCP
Stone Attack
Andhra Pradesh

More Telugu News